NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గిరిజనులకు రాజ్యాంగ ఫలాలు అందేలా చూడాలి

1 min read

ఎస్టీలుపై దాడులను తీవ్రంగా పరిగణించాలి, సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక దృష్టి

రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి

గిరిజన సమస్యలు పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత

జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గిరిజనులకు రాజ్యాంగ పరమైన హక్కులు, సంక్షేమ పధకాలు  ప్రయోజనాలు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి తెలిపారు.  జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన ఏలూరు కలెక్టరేటు గోదావరి సమావేశమందిరంలో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి పాల్గొని గిరిజన సమస్యలు, సంక్షేమ పధకాల అమలుపై, ఆయా శాఖల్లో రోస్టర్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, ఎస్టీ బ్యాక్ లాగ్ ఖాళీలు భర్తీ, తదితర అంశాలుపై అధికారులతో సమీక్షించారు. అనంతరం గిరిజనులు నుంచి ఆయా సమస్యలు పరిష్కారంకోసం వినతులను ఆయన స్వీకరించారు.  సమావేశంలో జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, ఎస్టీ కమీషన్ సభ్యులు కాకి లక్షీ, గొర్లె సునీత, జిల్లా జాయింటు కలెక్టరు డా.ఎం.జె. అభిషేక్ గౌడ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజులుగా జిల్లాలో పర్యటించి గిరిజనులనుంచి వినతులు స్వీకరించినట్లు పేర్కొంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తామని తెలిపారు.  జిల్లాలోని 18 ఎస్టీ విద్యాసంస్ధల్లో రూ. 1.47 కోట్లతో 196 టాయిలెట్స్ ను మంజూరు చేసిన జిల్లా కలెక్టరు వారిని ఆయన అభినందించారు.  ఈ పనులన్నింటిని నెలలోపు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో గిరిజనులకు అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు తీరును ఆయన సమీక్షిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ కు సంబంధించి ఏవైనా సమస్యలుంటే వాటిని విచారణ చేసి వాటిని పరిష్కరిస్తున్నామన్నారు.  గిరిజన ప్రాంతంలోని 5 మండలాల్లో ఉపాధిహామీ కింద రూ. 30 కోట్లతో రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కమీషన్  జిల్లా పర్యటన సందర్బంగా వారి దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. 

26 అర్జీలు రాక

ఎస్టీ కమీషన్ చైర్మన్ పర్యటన సందర్బంగా వివిధ సమస్యలపై ఏలూరు జిల్లా గిరిజన ప్రాంతాలకు చెందిన పలువురు గిరిజనులు 26 అర్జీలను అందజేశారు.  పోలవరం పరిధిలో 19 గ్రామాలకు చెందిన 18 సంవత్సరాలు నిండిన 375 మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కొండ్రుకోటకు చెందిన మొడియం గంగాభవానీ, యం. దుర్గ, తదితరులు వినతులు అందజేశారు, జీలుగుమిల్లి మండలం దాట్లవారి గూడెంకు చెందిన కణిత ధనలక్ష్మి తదితర మహిళలు ఎల్ టిఆర్ కేసులకు సంబంధించి కేసులను పరిష్కరించాలని కోరారు, జీలుగుమిల్లికు చెందిన మొడియం శ్రీనివాసరావు వినతిపత్రం ఇస్తూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాలువ ఆయుకట్టు పరిదిలోని భూమిని సేకరించడం ద్వారా గిరిజనులు, గిరిజనేతరులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.  సమావేశంలో ఎస్టీ కమీషన్ డిప్యూటీ డైరెక్టర్ కట్టా సాంబయ్య , ఐటిడిఏ పివో కె.రాములు నాయక్, డిఎఫ్ఓ పి.వి.సంధీప్ రెడ్డి, ఇన్ చార్జి డిఆర్ఓ ఎల్. దేవకీదేవి, జెడ్పి సిఇఓ పి.జగదాంబ, డిపివో జి జి.మల్లిఖార్జునరావు, ఆర్ డిఓ కె.లక్ష్మీప్రసన్న, జిల్లా వ్యవసాయశాఖ అధికారి యస్.కె.హబీబ్ భాషా, ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ కె.ఎం. అంబేద్కర్, వివిధ శాఖలు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author