తాళ్లమూడిలో ఆశాజ్యోతి విభిన్న ప్రతిభావంతుల వసతి గృహాన్ని సందర్శన
1 min read
మానసిక విభిన్న ప్రతిభా వంతులను గుర్తించి వసతి గృహాలకు చేర్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంది
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యన్.శ్రీలక్ష్మి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యన్. శ్రీలక్ష్మి ఈరోజు అప్పనవీడు,తాళ్లమూడిలోని ఆశాజ్యోతి విభిన్న ప్రతిభావంతుల వసతి గృహాన్ని సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీ లక్ష్మీ మాట్లాడుతూ మానసిక విభిన్న ప్రతిభా వంతులను గుర్తించి వసతి గృహాలకు చేర్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుల పైన ఉందని, వారికి పునరావాసం నాణ్యమైన వైద్య ఆహారం మొదలైన వసతులను అందించే అవకాశం ఉంటుందని,కావున ప్రతి ఒక్కరూ అనాధలైన విభిన్న ప్రతిభా వంతులను గుర్తించి, దగ్గర్లోని స్వచ్ఛంద సంస్థలకు లేదా వసతి గృహాలనందు చేర్పించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ప్రతి రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్లో విభిన్న ప్రతిభావం తల హక్కులను మరియు ప్రతి పౌరులు వారితో నడుచుకోవాల్సిన ఇది విధానాల యొక్క వివరాలను పొందుపరచాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు. అవసరమైన అర్హత కలిగిన విన్న ప్రతిభావంతులకు ఆధార కార్డు పెన్షన్ మొదలైన సౌకర్యాలు కల్పించడంలో న్యాయ సేవాధికార సంస్థ సహాయపడుతుందని సూచించారు మరియు కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ ఎమ్ మాధవిలత,ఏలూరు డిస్టిక్ బాలిక సంరక్షణ అధికారిని సిహెచ్. సూర్య చక్రవేణి, ఇన్చార్జి చైర్పర్సన్ చైర్పర్సన్ పీ. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

