ఈఎన్టి విద్యార్థులు మెళకువలు నేర్చుకోవాలి
1 min read

ఏఓఐ కర్నూలు జిల్లా అధ్యక్షుడు డా. జయ ప్రకాశ్ రెడ్డి
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు: ప్రస్తుత కాలుష్య వాతావరణంలో సంచరిస్తూ …సైనస్ సమస్యతో అవస్థలు పడుతున్న వారి సంఖ్య అధికమయ్యిందన్నారు అసోసిసియేషన్ ఆఫ్ ఓటోలరింగాలజిస్ట్ ఆఫ్ ఇండియా ( ఏఓఐ) కర్నూలు బ్రాంచ్ అధ్యక్షుడు డా. జయ ప్రకాశ్ రెడ్డి. కర్నూలు సర్వజన ఆస్పత్రిలోని ఈఎన్టి డిపార్ట్ మెంట్ లో వైస్ ప్రిన్సిపల్ డా. సాయి సుధీర్ నేతృత్వంలో బుధవారం కేఎంసీ, విమ్స్ , నంద్యాల శాంతి రాం మెడికల్ కాలేజి ఈఎన్టి మెడికల్ విద్యార్థులకు సర్జరీ, వ్యాధి గుర్తింపు, చికిత్స తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఓఐ కర్నూలు జిల్లా అధ్యక్షుడు డా. జయ ప్రకాశ్ రెడ్డి మాట్లాడారు. ముక్కు గాలి కుహరాలలో బ్యాక్టిరియా ఇన్ ఫెక్షన్ అయి ఉంటే ఎలా చికిత్స చేయాలి, అలాగే నోరు, చెవి నొప్పితో వచ్చిన వారికి ఎలాంటి చికిత్స చేయాలి, సర్జరీ తదితర అంశాలపై స్పష్టంగా వివరించారు. అదేవిధంగా ప్రాక్టికల్ కూడా విద్యార్థులతో చేయించారు. కార్యక్రమంలో అసోసిసియేషన్ ఆఫ్ ఓటోలరింగాలజిస్ట్ ఆఫ్ ఇండియా ( ఏఓఐ) కర్నూలు జిల్లా సెక్రటరి డా. మహేంద్ర, ప్రొఫెసర్లు మునీరుద్దీన్ , సి.వెంకటేశ్వర రావు, ఈఎన్టి హెచ్ ఓడి, జీజీహెచ్ కర్నూలు డా. హరి కృష్ణ తదితరులు ఈఎన్టి విద్యార్థులకు చికిత్స విధానం, వ్యాధి గుర్తింపు తదితర అంశాలపై వెల్లడించారు.

