NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పొలం సమస్య..సీఎం దగ్గరికైనా వెళ్తాం

1 min read

పట్టించుకోని రెవెన్యూ అధికారులు

ఆత్మహత్యే శరణ్యం అంటున్న కుటుంబ సభ్యులు

 నందికొట్కూరు , న్యూస్ నేడు   : మా పొలం సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామానికి చెందిన కలీ ముల్లా,రహంతుల్లా మరియు కుటుంబ సభ్యులు అన్నారు.పొలం సమస్య పరిష్కరించాలని ఎన్నిసార్లు రెవెన్యూ అధికారుల చుట్టూతిరిగినా పరిష్కారం కావడం లేదని బుధవారం పాత్రికేయుల ఎదుట కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు.ఈ సందర్భంగా పాత్రికేయులతో వారు మాట్లాడుతూ నా పొలంలోకి నన్ను వెళ్ళనివ్వడం లేదునాకు ఉన్న ఎకరా పొలంలోకి గ్రామ పెద్దలు వెళ్ళనీయడం  లేదు సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారు.గ్రామ రెవెన్యూ అధికారులు కూడా సహకరించడం లేదని మాకు ఆత్మహత్య శరణ్యమనికలీముల్లా,రహంతుల్లా  ఇస్మాయిల్,కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.గత కొన్ని సంవత్సరాలుగా మా నాన్నకు గ్రామ పొలిమేరలోని సర్వే నంబర్లు 275-160,278-3 ఎకరాల 60 సెంట్లు ఉందని అందులో కొంత రోడ్డుకు వెళ్ళగా మిగిలిన భూమిని సాగు చేసుకోవాలని వెళ్ళగా గ్రామ పెద్దలైన సర్పంచు మరి కొంతమంది దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారని వాపోయారు.మాకు ఉన్న ఎకరం మరియు పొరంబోగు రెండు ఎకరాలు  పొలాన్ని దున్నుకొనివ్వక పోకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని లేకపోతే సీఎం,డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్తామని వారు అన్నారు.

About Author