NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులు కొత్త రకం వరి వంగడాలను వేసుకోవాలి

1 min read

కడప డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మీ మాధవి

న్యూస్ నేడు చెన్నూరు : రైతులు వ్యవసాయంలో కొత్త పద్ధతులు అనుసరించాలని అలాగే కొత్త రకం వరి వంగడాలను వేసుకోవాలని కడప డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు జి లక్ష్మీ మాధవి తెలిపారు రైతన్న -మీకోసం కార్యక్రమంలో భాగంగా బుధవారం చెన్నూరు మండలంలోని రైతు సేవా కేంద్రంలో రైతులతో వర్క్ షాపు నిర్వహించడం జరిగింది. రామనపల్లి రైతు సేవా కేంద్రంలో జరిగిన వర్క్ షాప్ లో కడప డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు జి లక్ష్మీ మాధవి పాల్గొని రైతులతో మాట్లాడటం జరిగింది. రైతులు కొత్త వరి వంగడాలను వేసుకోవాలని తెలియజేశారు. జింక్, పొటాష్ వంటి ఎరువులను వేయడం ద్వారా వరిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి గింజ నాణ్యత పెరుగుతుందని తెలియజేశారు. యూరియాను  సిఫారసు కు మించి వాడరాదని తెలియజేశారు. రసాయనిక మందులు  విచక్షణా రహితంగా వాడడం ద్వారా పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండి ఎగుమతులకు అనుకూలంగా ఉండడం లేదని తెలియజేశారు. మార్కెట్ ధర బాగా ఉండాలంటే మన ఎగుమతులు పెరగాలని తెలియజేశారు. మినుము, పెసర, నువ్వులు, వేరుశెనగ, జొన్న, సజ్జ వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే శ్రీదేవి, కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ తాడిగోట్ల వెంకటసుబ్బారెడ్డి, రాష్ట్ర అటవీ శాఖ మాజీ డైరెక్టర్ శ్రీలక్ష్మి, ఉద్యాన అధికారి వసంత, రైతులు పాల్గొన్నారు.

About Author