‘ఇంటింటికీ టీడీపీ’లో దూసుకెళ్తున్న జమీల్..
1 min read
ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ..
నందికొట్కూరు న్యూస్ నేడు: ‘రెండేళ్ల నమ్మకం- ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ’అనే కార్యక్రమంలో భాగంగా నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ఎండీ జమీల్ ఇంటింటికీ వెళ్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించడంలో దూసుకెళ్తున్నారు. నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివనందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని 80వ బూత్ లో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం’ కార్యక్రమం శనివారం నిర్వహించారు.జమీల్ తో పాటు రెండవ వార్డు ఇంచార్జ్ అబ్దుల్ ముజీబ్,స్థానిక నాయకులు జిఎం రఫీ,పి శాలు,పి చాంద్,జావీద్,మహమ్మద్ సమీర్ ప్రతి ఇంటికి వెళ్లి గత రెండేళ్ల ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వారు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమానికిప్రజల నుంచి విశేష స్పందన లభించింది.పార్టీ ఎప్పుడూ ప్రజల సంక్షేమానికి, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి పునరంకితమై పనిచేస్తుందని వారు తెలియజేశారు.


