సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం…
1 min read

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు సత్రం రామకృష్ణుడు
కర్నూలు, న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ లో సుపరిపాలనకు తొలి అడుగులో భాగంగా కర్నూల్ పట్టణం నందు ఈ రోజు అనగా తేదీ 07 జూలై 2025 న, డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో భాగంగ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ ఆదేశాల మేరకు కర్నూల్ పట్టణం జివిఎల్ సుజాత శేషు యాదవ్ కార్పొరేటర్ 5 వ వార్డు ఇంచార్జ్ వారి ఆధ్వర్యంలో జరుగగా ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు సత్రం రామకృష్ణుడు పాల్గొనగా మరియు కర్నూల్ టిడిపి బీసీ సెల్ మహిళా కార్యదర్శి జి. విజయలక్ష్మియాదవ్ , బూత్ ఇంచార్జీలుజి. కళ్యాణి, హేమలత, హారిక, వసుంధర, మంజుల, మహేష్ టీడీపీ నాయకులు శ్రేణులు పాల్గొని ప్రజల వద్దకు వెళ్లి సంవత్సర కాలంలో ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు.. చేయబోతున్న మంచిని వివరించారు. అలాగే కూటమి ప్రభుత్వ పథకాలు అయిన తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దీపం పథకం వంటి పథకాలు అర్హులకు సకాలంలో అందుతున్నాయా లేదో వాకబు చేసి వాటిపై లబ్ధిదారుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. కూటమి ప్రభుత్వ పథకాల పై ,మరియు ప్రభుత్వ సుపరిపాలన పై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

