NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలం దర్శనార్థం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం

1 min read

నంద్యాల జిల్లా- శ్రీశైలం న్యూస్​ నేడు:  ద్వాదశాలలో రెండవ జ్యోతిర్లింగం… ఆరవ అష్టాదశ శక్తిపీఠం… ఇలలో వెలసిన కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం మంగళవారం ఉదయం 12.40 గంటలకు  శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆలయ సంప్రదాయం ప్రకారం…  రాష్ట్ర ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేదమంత్రాలతో  స్వామివారి దర్శనార్థం ఆలయంలోకి తీసుకువెళ్లిన అర్చకులు.ఆలయంలో ప్రధమంగా రత్నగర్భ గణపతిని దర్శించుకున్న ముఖ్యమంత్రిఅనంతరం శ్రీశైల మల్లికార్జున స్వామిని, శ్రీ భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని అర్చన కార్యక్రమంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ముఖ్యమంత్రి  పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో రుద్ర హోమం పూర్ణాహుతిలో ముఖ్యమంత్రి  పాల్గొన్నారు.అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ ఎండి ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి,  ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, దేవదాయ శాఖ సెక్రెటరీ వినయ్ చంద్, కమిషనర్ రామచంద్ర మోహన్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, ఆలయ ఈవో శ్రీనివాసరావు, జేఈవో, పిఆర్వోలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author