NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి – ప్రాణాలు కాపాడుకోండి

1 min read

కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్

రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం

వీడియోల ద్వారా ట్రాఫిక్ నిబంధనలపై చైతన్యం

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.

” నేను ట్రాఫిక్ మిత్ర ” ఫిర్యాదులపై చర్యలు – అవగాహన కౌన్సెలింగ్

సురక్షిత ప్రయాణమే లక్ష్యం.

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్  ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన కల్పించేందుకు కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్  మాట్లాడుతూ.. ‘నేను ట్రాఫిక్ మిత్ర’ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించామని తెలిపారు.కౌన్సెలింగ్‌లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక వీడియోలను ప్రదర్శించి, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న ఈ-చలానాల రికవరీని వేగవంతం చేశామని, వాహనదారులు పెండింగ్ చలానాలను వెంటనే చెల్లించాలని సూచించారు.నిబంధనల ఉల్లంఘన పునరావృతమైతే డ్రైవింగ్ లైసెన్స్‌ల రద్దుకు సిఫార్సు చేస్తామన్నారు.కర్నూలు ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *