NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం తగదు

1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు

కర్నూలు, న్యూస్​ నేడు:  మంగళవారం  నగరంలో నిర్వహించే పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం తగదని, ప్రజలు సంతృప్తి చెందేలా విధులు నిర్వర్తించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. మంగళవారం ఆయన ఆశోక్ నగర్, పాతబస్తీ, కల్లూరు ప్రాంతాల్లో ఆయన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. చిన్న, మధ్య స్థాయి కాలువల్లో ప్రతి వారం పూడికతీత పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న సమయంలో ప్రత్యేకంగా గ్యాంగ్ వర్కర్లతో పూడికతీత పనులు నిర్వహించాలని సూచించారు. పూడికతీత అనంతరం తీసిన వ్యర్థాలను 24 గంటలలోపు పూర్తిగా తొలగించాలని కమిషనర్ స్పష్టం చేశారు.కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు రాజు, మునిస్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *