భక్తుల సౌకర్యార్థం కోసం అన్నదాన కార్యక్రమం
1 min read
పాల్గొన్న మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి..
నందికొట్కూరు, న్యూస్ నేడు: భక్తుల సౌకర్యార్థం కోసంఅన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అన్నారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు పాదయాత్రగా వెళ్తున్న శివ స్వాములకు నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఆత్మకూరు రోడ్డు జమ్మి చెట్టు దగ్గర మంగళవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం పాండురంగ స్వామి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో కొనసాగింది.ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకుభక్తులకు అన్నదానం చేసి, వారి సేవలో పాలుపంచుకున్నారు. తర్వాత మున్సిపాలిటీ చైర్మన్ మాట్లాడుతూసుదూర ప్రాంతాల నుండి కాలినడకన తరలివచ్చే భక్తులకు అన్నదానం చేయడం ఎంతో పుణ్యకార్యమని అన్నారు.అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాండు స్వామిని మరియు వారి బృందాన్ని అభినందించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

