NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నెరనికి గ్రామంలో ఉపాధి పనుల లేమి – బాలల హక్కులుపై తీవ్ర ప్రభావం

1 min read

తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో నీవినతి

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలం, నెరనికి గ్రామంలో గత దాదాపు 12 నెలలుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు పూర్తిగా నిలిచిపోవడం వల్ల గ్రామంలోని పేద కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బాలల హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ఎస్. కేంచప్ప తెలిపారు.ఉపాధి లేకపోవడం కారణంగా సుమారు 40 కుటుంబాలు చిన్న పిల్లలతో సహా గుంటూరు ప్రాంతానికి వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీని వల్ల గ్రామంలోని అనేక మంది బాలబాలికలు తమ విద్యను మధ్యలోనే నిలిపివేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వలసల ప్రభావం నేరుగా గ్రామ విద్యా వ్యవస్థపై పడుతోందని, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా తగ్గిపోవడం, డ్రాప్‌ఔట్ సమస్య పెరగడం, పిల్లలు బాల కార్మికులుగా మారే ప్రమాదం ఏర్పడడం వంటి సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయని తెలిపారు. వలస కుటుంబాల పిల్లల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన “సీజనల్ హాస్టల్స్” సదుపాయాన్ని వెంటనే అమలు చేయాలి.పాఠశాల విద్యాశాఖ, ఐసీడీఎస్, ఉపాధి హామీ శాఖల సమన్వయంతో బాలల పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలి.గ్రామ విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.ఈ సమస్య కేవలం ఉపాధి సమస్య మాత్రమే కాకుండా, పూర్తిగా బాలల భవిష్యత్తు మరియు గ్రామ విద్యా వ్యవస్థను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశమని ఆయన స్పష్టం చేశారు.అందువల్ల అధికారులు దీనిని అత్యవసర సమస్యగా గుర్తించి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని ఎస్. కేంచప్ప పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో మల్లికార్జున దేవప్ప పక్కిరప్ప గోవర్ధన్ లింగంపల్లి శేషగిరి శివలింగ తదితరులు పాల్గొన్నారు.

About Author