NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిఐటియు అఖిలభారత 18వ మహాసభలను జయప్రదం చేయండి

1 min read

సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, 

పత్తికొండ  , న్యూస్​ నేడు:  ఆల్ ఇండియా 18వ సిఐటియు మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర పిలుపునిచ్చారు. బుధవారం పత్తికొండ పట్టణంలోని ఆదోని రోడ్డులో ఉన్న సిఐటియు ఆటో అడ్డా దగ్గర ఆల్ ఇండియా మహాసభల పోస్టర్ను ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శేఖర్, ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, మాట్లాడుతూ, అఖిలభారత 18వ సిఐటియు మహాసభలను జయప్రదం చేయాలని, ఆటో కార్మికులు ఆల్ ఇండియా సిఐటియు మహాసభలకు తరలి రావాలని కోరారు.దేశవ్యాప్తంగా విశాఖపట్నంలో ఈనెల 31 నుండి జనవరి 4 వరకు జరిగే ఆలిండియా మహాసభల్లో కార్మికుల పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును కార్మిక వ్యతిరేక విధానాలకు ఆజ్యం పోస్తున్న  ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ మహాసభలకు సిపిఎం పార్టీ కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్, హాజరవుతారని, దేశంలోని సిపిఎం పార్టీ సిఐటియు నాయకులు, అతిరథ మేధావులు, పార్టీ సానుభూతిపరులు లక్షలాదిమంది సిఐటియు కార్మికులు  పాల్గొనడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాష రాతన ఆటో అడ్డ యూనియన్ నాయకులు మాబు ఆదోని అడ్డా ఆటో వర్కర్స్ కార్మికులు పెండేకల్, ముక్కల్ల, మారెళ్ళ ఆటో అడ్డా జై గిరి, చందోలి ఆటో అడ్డా వర్కర్ యూనియన్ నాయకులు కాశి తదితరులు పాల్గొన్నారు.

About Author