మిడుతూరులో ‘రైతన్న మీకోసం’..కార్యక్రమం
1 min read

రైతులకు కరపత్రాలు అందించిన ఎంపీడీఓ,రమేష్ రెడ్డి
మిడుతూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో సుంకులమ్మ గుడి వీధిలో ‘రైతన్న మీకోసం’అనేకార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ నగదు రెండవ విడత రైతులకు ఇవ్వడంతో ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న వాటి గురించి కరపత్రాలను ఏడు రోజులపాటు ఈ నెల 29 వరకు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడంతో అందులో భాగంగా గ్రామంలోని రైతుల వద్దకు వెళ్లి ఎంపీడీవో దశరథ రామయ్య,మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాసులు, మండల వ్యవసాయ అధికారి పీరు నాయక్ సోమవారం ప్రభుత్వ కరపత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో వీఆర్వో వెంకటయ్య,గోకారి,పుల్లమ్మ, శీను,శీను,వ్యవసాయ పరిమితి సంఘం సీఈఓ మల్లికార్జున,ఫీల్డ్ అసిస్టెంట్ మధు,ప్రకృతి వ్యవసాయం అధికారులు నరేంద్ర,దాసు పాల్గొన్నారు.

