NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాలాణుగున వసతి కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

1 min read

విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంఈఓ రమేష్ పిలుపు

పత్తికొండ, న్యూస్​ నేడు:   వలస వలస వెళ్లే తల్లిదండ్రుల కుటుంబాల్లోని పిల్లలను విద్యకు దూరం కాకుండా కాకుండా గ్రామంలోని వసతి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాలానుగుణ వసతి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పత్తికొండ ఎంఈఓ రమేష్ విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. శనివారం మండలంలోని నలగదొడ్డి గ్రామంలో ఏర్పాటు చేసిన కాలానుగుణ వసతి కేంద్రాన్ని ఎంఈఓ రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వలస వెళ్లే తల్లిదండ్రుల కుటుంబాల్లోని పిల్లలకు  విద్యను దూరం కాకుండా వారిని అదే గ్రామంలో ఉంచుతూ విద్యను అందించే ఒక గొప్ప పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని దీనిని వలస వెళ్లే తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని వారి కుటుంబాలోని చదువుకుంటున్న పిల్లలను ఈ కేంద్రాల్లో వదిలి వెళ్లాలని ఆయన సూచించారు. అలాగే ఆయా  విద్యార్థులకు విద్యను దూరం కాకుండా సహకరించాలని పత్తికొండ మండల 2వ విద్యాధికారి  రమేష్  ఆయా గ్రామాల్లోని తల్లిదండ్రులను కోరారు. ఈ మేరకు పత్తికొండ మండలంలోని నలకదొడ్డి, దేవనబండ కోతి రాళ్ల, దూదేకొండ గ్రామాల్లో కాలానుగును వసతి కేంద్రాలను ఆయన ముఖ్య అతిధి గా పాల్గొని, ప్రారంభించారు.ఆయా గ్రామాల నాయకులు బత్తిని రాజసేకర్, నాగేష్, పరమేష్, రంగస్వామి గోవింద్, మధ్యాహ్నమయ్య లు మాట్లాడుతూ పత్తికొండ శాసన సభ్యులు కే.ఈ శ్యామ్ బాబు ఆదేశాలతో కేంద్రాలు మంజూరు అయ్యాయని, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని నిర్వాహకులను కోరారు ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి జాకీర్ హుస్సేన్ రామాంజనేయులు ఉపేంద్ర,ప్రభాకర్,గార్లు విద్యాకామిటీ చైర్మన్ లు పులిరoగడు, ప్రకాష్,రంగమ్మ, లింగన్న, తదితరులు పాల్గొన్నారు.

About Author