NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాశ్మీర్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజ్యసభ మాజీ సభ్యులు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: నగరంలోని ఎగ్జిబిషన్ మైదానంలో లో ఏర్పాటుచేసిన కాశ్మీర్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తో పాటు కర్నూల్ పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఇల్లూరు లక్ష్మయ్య, మైనార్టీ నాయకులు నౌషాద్, కార్పొరేటర్ పరమేష్ ,ఎగ్జిబిషన్ నిర్వాహకులు కస్తూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశ్మీర్ ఎగ్జిబిషన్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎంపీ బస్తిపాటి నాగరాజ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ ప్రత్యేకతలను నిర్వాహకులు వారికి వివరించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూల్ నగరంలో అందరినీ ఆకట్టుకునేలా కాశ్మీర్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించే ప్రజలు కాశ్మీర్ లో ఉన్న అందాలను ఆస్వాదించవచ్చని తెలియజేశారు. ఇక్కడ సెల్ఫీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఇది కర్నూలు కొత్తదనాన్ని తీసుకువస్తుందన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారని, ముఖ్యంగా కర్నూల్ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక విప్లవం జరుగుతుందని చెప్పారు. అనంతరం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కర్నూల్ నగరంలో ప్రజలను ఆకట్టుకునేలా కాశ్మీర్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈ ఎగ్జిబిషన్ ను ప్రతి ఒక్కరు సందర్శించి ఆహ్లాదాన్ని పొందాలని కోరారు. అనంతరం ఎగ్జిబిషన్ నిర్వాహకులు కస్తూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎగ్జిబిషన్ ప్రత్యేకతలను వివరించారు.

About Author