NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలం, న్యూస్​ నేడు:          లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (03.10.2025) సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్లకు  ఊయలసేవను నిర్వహించనున్నది.ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలానక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ                   జరిపించబడుతోంది.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠిస్తారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించబడుతుంది.           అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ జరిపించబడుతుంది. తరువాత చివరగా ఊయలసేవ నిర్వహించబడుతుంది.        ఊయలసేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించబడుతాయి.పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలు వినియోగించడం జరుగుతుంది.

About Author