మాజీ సర్పంచ్ చిట్టి బొమ్మ వెంకటేశ్వరరావు మృతి
1 min read
ఆ కుటుంబానికి తీరని లోటు
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
భుజంపై పాడేత్తుకుని అంతిమయాత్రలో వీడ్కోలు
పార్టీ నాయకులతో అంత్యక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదవేగి మండలం జానం పేట మాజీ సర్పంచ్ చిట్టిబొమ్మ వెంకటేశ్వరావు బుధవారం మృతి చెందారు,జానం పేట గ్రామం ఒక మంచి టి డి పి నాయకుడిని కోల్పోయింది,సమాచారం తెలుసుకున్న దెందులూరు ఎమ్ ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్,విజయరాయి సొసైటీ అధ్యక్షుడు బొప్పన సుధాకర్ జానం పేట చేరుకుని తమ పార్టీ నాయకుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు, జానంపేట టి డి పి మాజీ సర్పంచ్ పార్ధీవ దేహానికి ఎమ్ ఎల్ ఏ చింతమనేని పూల మాలలు వేసి నివాళులు అర్పించారు,వెంకటేశ్వరరావు పాడెను కుడా చింతమనేని తన భుజం పై ఎత్తుకుని మోసి అంతిమ యాత్రలో పాల్గొని వీడ్కోలు పలికారు.


