NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జూనియర్ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం

1 min read

బహుమతులను అందజేసిన డిఐఈఓ శంకర్ నాయక్..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం కళాశాల 25వ వార్షికోత్సవాలు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎం ఎల్లన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్ హాజరయ్యారు.ఈ సందర్భంగా డిఐఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకోవాలంటే లెక్చరల్లో చెప్పిన విధంగా నడుచుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి ప్రవర్తన ద్వారా మంచి విద్యతో మీ జీవితంలో స్తిరపడాలనే లక్ష్యంతో మీరు ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఈ కళాశాలలో చదువుకున్న వారు ఎంతో మంది ప్రయోజకులు అయ్యారని వారి మాదిరిగానే మీరు కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండే విధంగా మంచిగా చదువుకోవాలని మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి అన్నారు.ఇంటర్ ప్రధమ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారికి మరియుఆటల పోటీల అనంతరం విద్యార్థులకు బహుమతులను డిఐఈఓ అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ శ్రీధర్ రెడ్డి,బుసగౌడ్,అధ్యాపకులు తిరుమలేశ్వర్ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి, శివకుమార్,భవానీ,విశాలాక్షి, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author