జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన తెలుగుయువత మాజీ రాష్ట్ర కార్యదర్శి
1 min read

హొళగుంద న్యూస్ నేడు : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శన హోళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన తెలుగుయువత మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యట శేషగిరి .హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని శౌచాలయాలకు సంబంధించి శుక్రవారం నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనానికి ప్రతిస్పందనగా ఆలూరు ప్రోగ్రామింగ్ కో ఆర్డినేటర్, ఆర్.టి.సి రీజినల్ చైర్మన్ శ్రీ పూల నాగరాజు మరియు కర్నూల్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాటు నాగరాజు ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థుల సంఖ్యను కలిగిన హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం నాడు తెలుగుదేశం బృందంతో సందర్శించిన తెలుగుయువత మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యట శేషగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థుల బాగోగులు, విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, శౌచాలయాలు తదితర విషయాలను క్షుణ్ణంగా పాఠశాల హెచ్.ఎం కబీర్ సాబ్ ను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం ఉన్నత పాఠశాలలోని మౌలిక వసతులు, శౌచాలయాలను పరిశీలించి విద్యార్థి, విద్యార్థినుల సౌకర్యార్థం శౌచాలయాల పరిశుభ్రత మరియు నీటి విషయమై చర్చించి సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది.సందర్శన ప్రాంతంలో టిడిపి యువ నాయకులు ఖాదర్ భాషా చిదానంద తదితరులు పాల్గొన్నారు.


