ఎన్ ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత రక్త వర్గం పరీక్షలు
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఎన్ ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆరోగ్య అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఉచిత రక్త వర్గం (బ్లడ్ గ్రూప్) పరీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 90 మంది విద్యార్థులకు ఉచితంగా రక్త వర్గ పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి తన రక్త వర్గాన్ని తెలుసుకోవడం అత్యంత అవసరమని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైనప్పుడు రక్త వర్గం తెలియడం ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రక్తదానం చేయాలన్నా, మనకు రక్తం ఎక్కించాల్సి వచ్చినా సరైన రక్త వర్గం గురించి ఖచ్చితమైన సమాచారం ఉండాలని సూచించారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా రక్త వర్గ పరీక్ష చేయించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర ల్యాబ్ టెక్నీషియన్లు కమల్, నాగసాయి ఉచితంగా రక్త వర్గ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నవీన్ పాటి పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అనంతలక్ష్మి, ముస్తాక్, వెంకటరమణ, ఓబులేసు, మద్దిలేటి, వెంకటేశ్వర్లు, మురళి మోహన్, శంకరయ్య, సురేష్, మంజునాథ్, వన్నూర్తో పాటు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


