NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో ఉచిత టెలికాం నైపుణ్య శిక్షణ కోర్సులు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఐటిఐ పూర్తి చేసిన విద్యార్థులు మరియు డిప్లమా  ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం ఉద్యోగ అవకాశాలతో ఉచిత టెలికం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ప్రారంభించినదని బిఎస్ఎన్ఎల్ కర్నూల్ బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్  జి రమేష్  ఒక ప్రకటనలో తెలిపారు.ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY)  పథకం కింద భారత ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధి మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఎ (MSDE) సహకారంతో భారత్ సంచార్ నిగం లిమిటెడ్( BSNL) ఈ కోర్సులు పూర్తిగా ఉచితం మరియు 18 సంవత్సరాలు పైబడిన నిరుద్యోగ యువతకు ముఖ్యంగా ఐటిఐ పాస్అవుట్ మరియు డిప్లమో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ఆసక్తిగల మరియు అర్హత ఉన్న అభ్యర్థులు www.rttchyd.bsnl.co.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాలు మరియు సంబంధిత అధికారుల సంప్రదింపు నంబర్ల కోసం అభ్యర్థులు RTTC వెబ్సైట్ను సందర్శించగలరని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ జి రమేష్  తెలిపారు.

About Author