NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చైల్డుకేర్ లీవ్ పై సి.యం  ఇచ్ఛిన హామి నిల బెట్టుకున్నందుకు కృతగ్ఞతలు..ఆర్టీసి ఇ.యు

1 min read

విజయవాడ , న్యూస్ ​నేడు :  మహిళా ఉద్యోగుల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రస్తుతం మహిళా ఉద్యోగులు వాడుకుంటున్న చైల్డుకేర్ లీవు పై పిల్లలకు 18 సంవత్సరాలు వయస్సులోపే వాడుకోవాలన్న నిబిందనలను సడలించి రిటైర్ అయ్యేలోగా ఎప్పుడైనా వాడుకొనే ఆదేశాలు ఇవ్వాలని గత ప్రభుత్వం నుండి ఏపిజేఏసి అమరావతి,ఏపిపిటిడి (ఆర్టీసి)ఎంప్లాయీస్ యూనియన్ చేసిన కృషి ఫలితంగా   ముఖ్యమంత్రి ఇటీవల ఉద్యోగసంఘాలతో జరిగిన చర్చలు సందర్బంగా దీపావళి కానుకగా ఇచ్చిన హామి చైల్డుకేర్ పై 18 సంవత్సరాలు సిలీంగు ఎత్తివేస్తూ రిటైర్ అయ్యేలా ఎప్పుడైనా వాడుకొనేలా మంగళవారం జిఓ నెః 70 విడుదల పట్ల ఏపిపిటిడి ఎంప్లాయిస్​ యూనియన్ రాష్ట్రఅధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు,రాష్ట్రప్రదానకార్యదర్శి జి.వి.నరసయ్య మంగళవారం ఒక ప్రకటన ద్వారా హర్షం వ్యక్తంచేసారు.ముఖ్యమంత్రి  ఇచ్చిన ఈ ఆదేశాలతో  రాష్ట్రంలో అన్ని డిపార్టుమెంటులలో 60 శాతం మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నప్పటీకీ ఆర్టీసిలో మాత్రం సుమారు 4600 మంది మహిళాఉద్యోగులే పనిచేస్తున్నారు.వీరందరికీ ముఖ్యమంత్రి దీపావళి కానుకగా ఇచ్చిన హామి మేరకు ఆదేశాలు రావడం వీరందరికీ ప్రయోజనం  కలుగుతుతుందని దామోదరరావు అన్నారు.

About Author