NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పేదల కోసం నిధులు

1 min read

40 కుటుంబాలకు రూ 15,77,420 లక్షల సీఎం సహానిది చెక్కులు పంపిణీ

మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి

మంత్రాలయం న్యూస్ నేడు :  రాష్ట్రం లో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా  పేదల ప్రజల కోసం సియం సహాయ నిధి నిధులు విడుదల చేస్తున్నారని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలో టిడిపి కార్యాలయంలో సియం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి సీఎం చంద్రబాబు నాయుడు  పేదలను ఆదుకుంటు న్నారని తెలిపారు. పేద వర్గాలకు సీఎం సహాయనిధి ఆసరా అవుతుందని తెలిపారు. నియోజకవర్గంలో 40 లబ్ధిదారులకు రూ 15 లక్షల 77 వేల 420 సియం సహాయ నిధి నిధులు మంజూరు అయినట్టు తెలిపారు. మంత్రాలయం మండలంలో 10 మందికి గాను రూ 4,49,227 రూపాయలు, కౌతాళం మండలంలో 11 మందికి గాను రూ 4,61,675రూపాయలు,  పెద్దకడబూరు మండలంలో 11 మందికి గాను రూ 4,13,694 రూపాయలు,  కోసిగి మండలంలో 8 మందికి గాను రూ 2,52,824 రూపాయలను అందించడం జరిగిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోవాలని మెరుగైన వైద్యం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. లబ్ధిదారులందరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. రాఘవేంద్ర రెడ్డి, మాజీ సర్పంచ్, టిడిపి సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి లకు పూలమాలలు వేసి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం మండల నాయకులు మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, వరదరాజులు, క్లస్టర్ ఇంచార్జి, మంచాల సొసైటీ డైరెక్టర్లు చాపల నాగేష్, డిసి తిమప్ప, ఎంపీటీసీ మేకల వెంకటేష్, రఘు, గుడిసే రాజన్న, రచ్చమరి నాయకులు పోలి శివ, పోలి వీరేష్, కోసిగి మండల టిడిపి అధ్యక్షులు పల్లె పాడు రామిరెడ్డి,ముత్తా రెడ్డి, మాజీ జడ్పీటీసీ రామకృష్ణ, తాయన్న,కౌతాళం మండల నాయకులు సతీష్ నాయుడు, టిప్పు సుల్తాన్, అడివప్ప గౌడ్, పెద్దకడబురు మండల నాయకులుబసలదొడ్డి ఈరన్న,మల్లికార్జున,మురళి క్లస్టర్ ఇంచార్జ్ మరియు నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author