NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల ముంగిటే తపాల సేవలు

1 min read

పోస్టల్ యస్పీ జనార్ధన్ రెడ్డి

మంత్రాలయం న్యూస్ నేడు :  తపాల శాఖలో నూతన టెక్నాలజీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐయంఏ 2.O ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజల ముంగిటే తపాల సేవలను అందివ్వడం జరుగుతుందని కర్నూలు జిల్లా పోస్టల్ యస్పీ శ్రీ జనార్ధన్ రెడ్డి  తెలిపారు. శనివారం మండల పరిధిలోని మండలం తుంగభద్ర ఉప తపాల కార్యాలయంను సందర్శించి,బిపియంలు, ఎబిపియంలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా యస్పీ జనార్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తక్కువ ప్రిమియం, ఎక్కువ బోనస్ తో తపాల బీమా,ఐపిపిబి ద్వారా ఖాతాలు తెరవడం, ఏఇపియస్ ద్వారా విత్ డ్రా చేయడం,GIG పాలసీలు, NPCI లింక్ చేయడం వంటి సేవలు అందివ్వడంతో పాటు 2.0 ద్వారా ఇంకా మెరుగైన సేవలను అంటే మీ దగ్గరికే వచ్చి స్పీడ్ పోస్ట్ బుక్ చేయడం,emo,పలు పథకాలకు సంబంధించిన సేవలు అందివ్వడానికి మా తపాల శాఖ వారు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు సబ్ డివిజన్ అధికారి నాగరాజు,యస్పీయం రమేష్,యంఓ దివాకర్, రంగారెడ్డి,గోవిందు,శంకర్ రెడ్డి,పునీత్,మౌనిక,అమృత, తేజస్వీని,యశ్వంత్,కృష్ణ, సుమన్,ఖాదర్ భాషా, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author