NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు సర్వజన ఆసుపత్రి అంటే ప్రజలకు భరోసా పెరిగేలా చర్యలు చేపట్టండి

1 min read

వైద్య అధికారులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచన

సర్వజన ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ గా (ఎఫ్ఎసి) నూతనంగా బాధ్యతలు చేపట్టిన డా:జి.శ్యామల

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాదపూర్వక కలయిక

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అనాటమి విభాగం హెచ్వోడీగా పనిచేస్తున్న శ్యామల ని ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్(ఎఫ్ఎసి) గా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అంటే ఎన్నో ఏళ్లుగా చుట్టుపక్కల నుండి అనేక గ్రామాలలో ఎంతోమంది పేద మధ్య తరగతి ప్రజలు  వైద్యం కోసం, అత్యవసర వైద్య సేవల కోసం ఎంతో నమ్మకంతో వస్తుంటారని, అయితే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కళాశాల గా రూపాంతరం చెందిన తరువాత ఇక్కడ వైద్య సేవల కన్నా పేషంట్లను విజయవాడ గుంటూరుకు రిఫర్ చేస్తున్న ఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుందని, ఈ అంశాన్ని ఒక సవాలుగా తీసుకుని పేషెంట్లను రిఫర్ చేసి పంపించేయడం కాకుండా అటువంటి మెరుగైన వైద్య చికిత్సలను ఇక్కడే అందించి ప్రజలకు అండగా నిలిచే విధంగా, ఏలూరు జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అంటే ప్రజలకు మరింత భరోసా కల్పించేలా కృషి చేయాలని సూచించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *