హజరత్ షేక్ష వలి షాషా వలి ఊరసు మహోత్సవంలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్”
1 min read

హొళగుంద న్యూస్ నేడు : కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఎల్లార్తి గ్రామంలోని సుప్రసిద్ధ హజరత్ షేక్షవలి షాషా వలి రహా వారి ఊరుసు మహోత్సవం సందర్బంగా ఎల్లార్తి టిడిపి సీనియర్ నాయకులు ఈడిగ గోవింద్ గౌడ్ , టిడిపి యువ నాయకులు ఈడిగ రాజేంద్ర గౌడ్ , ఈడిగ భువనేష్ గౌడ్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , మాజీ మంత్రి కేయి ప్రభాకర్ తో కలిసి దర్గాను సందర్శించి పవిత్ర చాదర్ ను సమర్పించి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు సరిహద్దు రాష్ట్రం కర్ణాటక నుండి వేలాది సంఖ్యలో కులమతాలకు అతీతంగా భక్తులు పాల్గొనే ఎల్లార్తి ఊరుసులో ఈరోజు తాము పాల్గొనడం ఎంతో సంతోషాదయాకమైన విషయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సూచనల మేరకు ఎల్లార్తి నందు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా సకల ఏర్పాట్లు చేశామని రాబోయే రోజుల్లో దర్గాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముస్లింల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి శ్రీమతి సబిహా పర్వీన్, దర్గా కమిటీ సభ్యులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్ అహ్మద్, ఎల్లార్తి టిడిపి నాయకులు వీరన్న గౌడ్ , దిద్ది నాగప్ప , దిద్ది మల్లయ్య , బిజెపి పంపాపతి , సిబిఎన్ ఆర్మీ ముళ్ళ మోయిన్ కురువ దర్గన్న , సాఫీర్ ఖాన్ , కురువ బందప్ప , మాల లింగప్ప , మల్లయ్య , వన్నూర్ వలి , వాసిమ్ భాష మరియు నంద్యాల టిడిపి నాయకులు సుబ్రీ, అక్బర్, కిరణ్, సైలాబ్, బుగ్గరాముడు, అర్షద్, ఖాజా దేవానగర్, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.



