జి.ఎస్.టి తగ్గింపుతో క్రీడా పరికరాల రేటు తగ్గింపు…
1 min read

జిఎస్టి తగ్గింపు ధరలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
సెట్కూర్ సిఈఓ డాక్టర్ వేణు గోపాల్
నంద్యాల, న్యూస్ నేడు: జి.ఎస్.టి తగ్గింపుతో క్రీడా పరికరాల రేటు 12 నుంచి 5,శాతం వరకు తగ్గించడం జరిగిందని సెట్కూరు సీఈవో డాక్టర్ వేణుగోపాల్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యువజన సంక్షేమ శాఖ – సెట్కూరు మరియు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ ‘ ఫై అవగాహన కొరకు టాయ్స్ మరియు స్పోర్ట్స్ దుకాణాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్బంగా సెట్కూర్ సి ఈ ఓ డాక్టర్. వేణు గోపాల్ మాట్లాడుతూ… నూతన జి యస్ టి స్లాబు ల సవరణ వల్ల క్రీడా పరికరాలఫై జి.ఎస్.టి 12% నుండి 5% తగ్గినదని, క్రీడాకారులకు క్రీడా వస్తువులు ఇప్పుడు 5% రేటు కిందకు వస్తాయని, తగ్గిన పన్ను భారం వల్ల డబ్బు ఆదా అవుతుందని, ఇది క్రీడాకారులకు ప్రోత్సాహకరమని తెలిపారు. క్రీడలు యువతలో శారీరక దృడత్వాన్ని మరియు మానసిక వికాసాన్ని పెంపొదిస్తాయనిస్తాయని పేర్కొన్నారు.నంద్యాల మండల అభివృద్ధి అధికారి సుగుణ శ్రీ మాట్లాడుతూ స్థానిక బొమ్మల సమూహాలు మరియు క్రీడా వస్తువుల పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వం “మేక్ ఇన్ ఇండియా” చొరవను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. తగ్గిన జిఎస్టి రేట్ల వలన దేశీయ డిమాండ్‌ను పునరుద్ధరించాయి మరియు ఎగుమతి పోటీతత్వాన్ని పెంచాయి, బొమ్మలు మరియు క్రీడా వస్తువులకు ప్రపంచ కేంద్రంగా మారాలనేదే భారతదేశ లక్ష్యం అని తెలిపారు. జీఎస్టీ తగ్గింపు ధరలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమాలలో సెట్కూరు సూపరిటెండెంట్ శ్యామ్ బాబు, క్రీడా ప్రాధికార సంస్థ శిక్షకులు సుదర్శన్, కిశోర్ బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

