సేవకు మారుపేరు ఆర్యవైశ్యులు..
1 min read

మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, మంత్రి టీజీ భరత్
కల్లూరులో టీ.జీ లక్ష్మీవెంకటేష్ వాసవీ భవన్ ప్రారంభించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్
కర్నూలు, న్యూస్ నేడు: కల్లూరు లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆవరణలో కల్లూరు వాసవి సేవా ట్రస్ట్, శ్రీ కల్లూరు వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేష్ వాసవి భవన్ ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దంపతులు వెలుగు హాజరై ప్రారంభించారు. ఈ భవనానికి సంబంధించిన శిలాఫలకాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దంపతులతో పాటు పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్ , ఆర్యవైశ్య సంఘం ప్రముఖుడు ఇల్లూరు లక్ష్మయ్య, కల్లూరు వాసవి సేవా ట్రస్ట్ చైర్మన్ చిలమకూరు రాజశేఖర్, వైస్ చైర్మన్ రామలింగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కల్లూరు లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆవరణలో టీజీ లక్ష్మీ వెంకటేష్ వాసవి భవన్ ను నిర్మించడం అభినందనీయమని చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి దాతలు ముందుకు రావాలంటే వాటిని నిర్మించే వారిపై నమ్మకం ఉండాలని ,ఆ నమ్మకం ఉండబట్టే ఇంత మంచి ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగిందని చెప్పారు.ఆర్య వైశ్య సామాజిక వర్గం వారు వైశ్యులకే సేవలు చేస్తారని కొందరు భావిస్తారని ,కానీ అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగపరంగా ఆర్యవైశ్యులకు ఎలాంటి హక్కులు ,ప్రభుత్వ పథకాలు అందడం లేదని, ఈ కారణంగానే ఆర్యవైశ్యులకు కొంత ఎక్కువ సేవ చేస్తున్నామని చెప్పారు. ఆర్యవైశ్యులకు రాజ్యాంగపరంగా ఎలాంటి హక్కులు లేకపోయినప్పటికీ తమ సంపాదించిన సంపాదనను మాత్రం అందరిని అందరికీ పంచుతామని వివరించారు. మహాత్మా గాంధీ అమరజీవి పొట్టి శ్రీరాములు కేవలం ఆర్యవైశ్యులకు మాత్రమే సేవలు అందించలేదని వారు దేశానికి అన్ని సామాజిక వర్గాల ప్రజలకు సేవలు అందించారని చెప్పారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కల్లూరులో శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ వాసవి భవన్ ను క్రమశిక్షణతో నిర్నిత సమయంలో పూర్తి చేయడం అభినందనీయమని తెలిపారు .ఆర్యవైశ్యులు అంటే సేవకు ప్రతిరూపం అని ఆయన వెల్లడించారు .ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సేవ చేసేందుకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్యవైశ్యులు మాత్రమే అని చెప్పారు.ఆర్యవైశ్యుల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ,రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు. వారు అందించిన సహకారంతోనే కామ శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ వాసవి భవన్ తో పాటు శ్రీ లక్ష్మీ వెంకటేష్ వాసవి మహిళా శిక్షణ కేంద్రం నిర్మించగలిగామని వెల్లడించారు. వారి సహకారం భవిష్యత్తులో ఇలాగే ఉండాలని కోరారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ లను కల్లూరు వాసవి సేవా ట్రస్ట్ తరఫున ఘనంగా సన్మానించారు. అలాగే భవన నిర్మాణానికి సహకరించిన దాతలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.


