శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారికి హనుమాద్ హోమం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఈ హోమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా విచ్చేసిన,వీక్షించిన సకల రోగ నివారిణి ఆయురారోగ్య ప్రాప్తి కలుగుతుంది ఆలయ కార్య నిర్వహణ అధికారిని ఆర్.వి. చందన ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం గ్రామము నందు వేంచేసియున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానము నందు “హనుమద్ హోమం” ఆలయ అర్చకులు, వేద పండితులు ఆద్వర్యములో జరిగినది. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఈ హనుమద్ హోమం ప్రతీ ఆదివారం భక్తులకు ఆర్జిత సేవగా దేవస్థానం వారు నిర్ణయించారు. ఈ హనుమద్ హోమ కార్యక్రమములో ప్రత్యక్షంగా కానీ పరోక్షముగా కానీ పాల్గొన్న వారికి మానసిక, శారీరక ఆరోగ్యం తో పాటు మానసిక ప్రశాంతత కలుగునని, విద్యార్దులకు లకు విద్యా ప్రాప్తి కలుగునని, కుటుంభ శక్యత, ఆన్నోన్య దాంపత్యం కలిగి సంతానం కలిగి సర్వత్ర విజయ చేకూరునని విశ్వాసం. కనుక భక్తులు దేవస్థానం నందు ప్రతీ ఆదివారం జరుగు ఈ హనుమద్ హోమం నందు పాల్గొనవలసినదిగా ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలియజేసినారు.

