మదాసికురువ మదారి కురువ జిల్లా కార్యవర్గ కమిటీ ఎన్నిక
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు : నగరం లోని రాజ్ విహార్ సెంటర్ దగ్గర లోని శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఆవరణలో మదాసికురువ మదారి కురువ(కురువ) హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.జిల్లా గౌరవ అధ్యక్షులు: నగరి నాగ భూషణం,జిల్లా అధ్యక్షులు: నేనికే రామ కిష్టప్ప, జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్: మంకే వెంకటేష్,జిల్లా ఉపాధ్యక్షులు గాజెల్లీ మధు, కాల్వ ముని, దిద్దికాటి భీరప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి గా కురువ శివ, సహాయ కార్యదర్శి లు కురువ వీరేష్,మంకే లక్ష్మన్న, పుల్లం రాజు, జిల్లా కోశాధికారి గా కురువ వెంకటగిరి వీరందరిని కులజుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న మదాసి కురువ, పాల్గొని, ఏకగ్రీవంగా ఎన్నికైన నాయకులకు నియామాక పత్రాలు అందజేసి, పూలమాల తో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సుంకన్న మదాసి కురువ మాట్లాడుతూ, కర్నూలు జిల్లా కమిటీ సభ్యులు ఏడు నియోజకవర్గం కమిటీ లను, 26 మండల కమిటీలను, జిల్లాలోని 500 గ్రామాల నుండి గ్రామానికి 10 మంది చొప్పున 5000 మంది నాయకులను తయారు చేయాలని, తద్వారా మన హక్కులు, రాజ్యాధికారం సాధన సాధ్యమవుతుందని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర కోశాధికారి, ఎల్ల రాముడు,ఆర్గనైజింగ్ సెక్రటరీ భరత్ కుమార్,కార్యవర్గ సభ్యులు సీత రాముడు, నాయకులు బజారి, గోవిందు, లక్ష్మి నారాయణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

