NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిడుతూరు ఖాజీగా జాకీర్ ఎంపిక పట్ల హర్షం..

1 min read

మిడుతూరు (నందికొట్కూరు ) న్యూస్​ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరుమండల ప్రభుత్వ ఖాజీగా జాకీర్ హుస్సేన్ ను నియమించారు.జాకీర్ హుస్సేన్ ఉప్పలదడియ గ్రామానికి చెందిన వారు. జాకీర్ హుస్సేన్ ను ఖాజీగా నియమిస్తూ వక్ఫ్ బోర్డు అధికారులు నియమించారు. ఈ ఉత్తర్వులను నంద్యాల జిల్లా కలెక్టర్ నుండి వచ్చిన ఉత్తర్వులనునంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి చేతుల మీదుగా జాకీర్ హుస్సేన్ కు నియామక పత్రాన్ని అల్లూరులో అందజేశారు.ఖా జీగా నియమించినందుకు గాను జాకీర్ హుస్సేన్ శివానందరెడ్డికి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.నాయకులు మరియు మైనారిటీ సోదరులు జాకీర్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాతా రమేష్ రెడ్డి,కమతం వీరారెడ్డి,కమతం రాజశేఖర్ రెడ్డి,రెహమాన్,లతీఫ్, మహబూబ్,రియాజ్, ముబారక్,హుస్సేన్ మియా పాల్గొన్నారు.

About Author