NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైరల్ జ్వరాల కారణంగా ఎటువంటి మరణం సంభవించకూడదు

1 min read

జ్వరాలు సోకిన వారికి ముఖ్యంగా గర్భీణీలకు వెంటనే చికిత్స అందించాలి

వైరల్ జ్వరాల రాకుండా ముందస్తు చర్యలపై ప్రజలకు అవగాహన కలిగించాలి

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవిస్తే కఠిన చర్యలు- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరిక

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : జిల్లాలో వైరల్ జ్వరాల కారణంగా ఎటువంటి మరణం సంభవించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై జిల్లా వైద్యాధికారులు, జిల్లాలోని ప్రాధమిక,సామజిక ఆరోగ్య కేంద్రాలు వైద్యాధికారులతో మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, వంటి  వైరల్ జ్వరాలు ప్రభలకుండా, వాటి  బారిన ఎవరూ పడకుండా తీసుకోవలసిన  ముందస్తు చర్యలపై  ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. వైరల్ జ్వరాలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి తక్షణమే వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా  మలేరియా సోకిన గర్భిణీలకు వెంటనే చికిత్స అందించాలని, ప్రమాద పరిస్థితి వరకు వేచి ఉండకుండా వెంటనే దగ్గరలోని సామజిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్నారు. జిల్లా వైద్య శాఖాధికారి, డివిజనల్ అధికారులు వైరల్ జ్వరాలు ఎక్కువగా నమోదైన గ్రామాలలోను, ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేసి, పరిస్థితులను పరిశీలించాలన్నారు. దోమల నిర్మూలనకు ఫాగింగ్, మురుగుకాల్వలలో స్ప్రేయింగ్ చేయించాలని, మురుగు నీరు ఎక్కువగా నిల్వ ఉన్న ప్రదేశాలలో దోమల నిర్మూలనకు ఆయిల్ బాల్స్, గంబూషియా చేపలు వదలాలన్నారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి  జె. అమృతం,  జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డా. పాల్ సతీష్, ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ డా. రాజీవ్, జిల్లా మలేరియా నిర్మూలన అధికారి డా. ప్రసాద్, జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యాధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author