జిల్లాలో కురువ కులస్థుల పై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం..ఎంపీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లాలో కురువ కులస్థుల పై జరుగుతున్న దాడులను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఖండించారు… పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాలలో భాగంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జీలింగ్ లో ఉన్న ఎంపీ నాగరాజు ఒక ప్రకటన ద్వారా దాడుల పై స్పందించారు…జిల్లాలోని పలు ప్రాంతాలలో కురువ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల పై దాడులకు పాల్పడటం విచారకరమన్నారు..ఇక కర్నూలు పట్టణంలో కాంట్రాక్టర్ రంగన్న పై జరిగిన దాడి హేయమైన చర్య అని, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు ముగిసిన తరవాత బాధితులను నేరుగా కలుస్తానన్న ఎంపీ నాగరాజు …దాడులకు పాల్పడిన వారి పై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

