NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

1 min read

కృషి, పట్టుదల, తపనతోనే విజయ శిఖరాలకు చేరుకోవచ్చు

ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

నంద్యాల, న్యూస్​ నేడు : విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కృషి, పట్టుదల, నేర్చుకోవాలనే తపనతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. శనివారం  నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్‌ను కలెక్టర్ సందర్శించారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా పదో తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్‌ను స్వయంగా పరిశీలించి, పాఠ్యాంశాలపై విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులతో కలిసి పాఠ్యాంశాలను చదివించి వారి అభ్యసన స్థాయిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన సూచనలు, సలహాలను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో సమావేశమై, రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను రాష్ట్రస్థాయిలో ఉత్తమంగా నిలబెట్టాలని సూచించారు. నేర్చుకోవాలనే తపనతో పాటు సానుకూల దృక్పథం కూడా అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు.అనంతరం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని పాఠశాలలో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సన్మానించారు. అలాగే జిల్లా స్థాయి స్పెల్ బీ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు లోకేష్, షారా లను మోమెంటో, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ జనార్దన్ రెడ్డి, ఎస్‌ఎస్‌ఏ పీఓ నిత్యానంద రాజు, పాఠశాల ప్రిన్సిపల్ పి.ఎన్. మల్లికార్జునప్పతో పాటు ఇతర అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author