ఏలూరులో ఘనంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు
1 min read
వేడుకలను ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు :జిల్లాలో విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారి అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ చేయూత నివ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా:ఎం. జె.అభిషేక్ గౌడ పిలుపులినిచ్చారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు కలక్టరేట్ లోని సమావేశపు హాలులో ఘనంగా నిర్వహించారు.వేడుకలను జిల్లా జాయింట్ కలక్టర్ అభిషేక్ గౌడ ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ అవకాశం ఇస్తే విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాలలోను తమ ప్రతిభను నిరూపించుకోగాలన్నారు. వారిని అన్ని రంగాలలో ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.విభిన్న ప్రతిభావంతులు సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని , వాటిని అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.వారి సమస్యలపై అందిన ఫిర్యాదులను కూడా ప్రాధాన్యతతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్బముగా నవంబరు 25వ తేదీన నిర్వహించబడిన విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలలో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులను జేసీ అందించారు.విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు కృషి చేస్తున్న స్వచ్చంద సంఘాల ప్రతినిధులను ఈ సందర్భంగా సత్కరించారు.విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్,డిఈఓ వెంకటలక్ష్మమ్మ , సెట్వెల్ సిఈఓ ప్రభాకర్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అజీజ్, విభిన్న స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు శ్రీనివాస రెడ్డి,హెన్రీ డొమినిక్, ఏ.వెంకట రమణ వీరభద్రరావు,కె.జయరాజు, జి.రాధారాణి,ప్రవీణ్ వర్మ, యం.నాగభూషణం,యుగంధర్ ఆర్.నాగేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు.


