పార్టీ కార్యకర్తగా సుస్థిరంగా కృషి చేస్తా..
1 min read

సోషల్ మీడియా లింగంపల్లి కురువ మౌనేష్
హొళగుంద న్యూస్ నేడు: వైఎస్ఆర్ సిపి పార్టీ తాలూకా సోషల్ మీడియా లింగంపల్లి కురువ మౌనేష్ బుధవారం వైయస్సార్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ఆర్సిపి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి తో కలిసి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన కురువ మౌనేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోనికి రావడం కోసం పార్టీ కార్యకర్తగా సుస్థిరంగా కృషి చేస్తానని అధినేతకు తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు మంచి రోజులు రానున్నాయని వైయస్సార్సీపీ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపినట్లు వైఎస్సార్సీపీ పార్టీ తాలూకా సోషల్ మీడియా లింగంపల్లి కురువ మౌనేష్ తెలిపారు.

