హంద్రీనీవా హెచ్ఎన్ఎస్ ఏబిసి కాలువ ద్వారా నీటిని విడుదల
1 min read

ఆలూరు న్యూస్ నేడు : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు .నారా చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని మరొకసారి రుజువైంది. ముక్యంగాఆలూరు తాలూకా ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి .బి.వీరభద్రగౌడ్ మరియు ఆలూరు తాలూకా ముద్దుబిడ్డ *గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే . గుమ్మనూరు జయరాములు హంద్రీనీవా హెచ్ఎన్ఎస్ ఆలూరు బ్రాంచ్ కెనాల్(ఏబిసి) కాలువ నుండి కొత్తగాఏర్పాటు చేసిన తూము ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది. ఇక్కడి నుండి ఆలూరు తాలూకాలోని చిప్పగిరి, హాలహర్వి,ఆలూరు మూడు మండలాలకు చెందిన రైతులకు వ్యవసాయ నీరు సరఫరా కానుండడం విశేషం. ఈకార్యక్రమంలో జిఎస్బిసి ఈఈ వెంకటరమణ, హెచ్ఎన్ఎస్ ఈఈ శ్రీనివాస్ నాయక్,డిఈ చంద్ర శేఖర్ డిసి చైర్మన్ కిష్టప్ప, డబ్ల్యుయుఏ ప్రెసిడెంట్లు,అలాగే ఆలూరు నియోజకవర్గ మరియు గుంతకల్ నియోజక వర్గానికి చెందిన ఇతర ముఖ్య నాయకులు,ప్రభుత్వ అధికారులు టిడిపి కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు అలాగే తెలుగుయువత, ఐటిడిపి, టిఎన్ఎస్ఎఫ్, టిఎన్టియుసి, టిడిపి సోషల్ మీడియా ప్రతినిధులు మండల టిడిపి సీనియర్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

