NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం ఆకస్మికంగా  తనిఖీ

1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరంలోని  కొత్తపేట  పట్టణ   ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పరిధిలోని     సచివాలయంలో జరుగుచున్న వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాన్ని సంచార చికిత్స కార్యక్రమాన్ని నోడల్ అధికారి డాక్టర్.రఘు   ఆకస్మికంగా  తనిఖీ చేశారు,  .అనంతరం  మాట్లాడుతూ మాతా శిశు ఆరోగ్యంపై ప్రభుత్వం అధిక ప్రాధాన్యతమిస్తుందన్నారు ప్రమాదకర సమస్యలు ఉన్న గర్భిణీలను క్రమబద్దంగా సకాలంలో తరచూ వారిని ఆరోగ్య కార్యకర్తలు  పర్యవేక్షించాలి,ముందుగా ఊహించిన కాన్పు తేదీల ప్రకారం గర్భవతులకు ప్రతి రోజు క్రమం తప్పకుండా వారి యొక్క ఆరోగ్య స్థితి గతులను కనుగొని అవసరమైన సలహాలు ఇవ్వవవలెను,గర్భిణీ నమోదు చేసే సమయంలో మాతా,శిశు సంరక్షణ కార్డును పూర్తి సమాచారంతో నింపవలెను. మొదట మాతా,శిశు సంరక్షణ కార్డులోనే ప్రసవ తేదీ నిర్ణయించబడు తుంది, కాబట్టి వారు అప్పటి నుండే ప్రసవ ప్రణాళిక చేసుకోవాలి అని తెలిపినారు.  మహిళలు గర్భం దాల్చిన దగ్గర నుంచి బిడ్డకు 16 సంవత్సరములు వచ్చే వరకు అన్నీ రకాల టీకాలను జిల్లాలోని అన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో,పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, అంగన్వాడీ కేంద్రములో ,సచివాలయాల్లో పూర్తిగా   ప్రభుత్వం  ఉచితంగా అందిస్తుందని , ప్రైవేటు ఆసుపత్రులకు  వెళ్లవలసిన అవసరం  లేదని తెలిపారు.   టీకాల ప్రాముఖ్యత వాటిని  నిర్లక్షo చేస్తే కలిగే నష్టాల గురించి తల్లితండ్రులు తప్పకుండ తెలుసుకోవాలి అని తెలిపినారు.చిన్నారులకు టీకాలు సకాలంలో ఇవ్వాలని ,అప్పుడే వారు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు, ఈ కార్యక్రమములో    మహిళా ఆరోగ్య కార్యకర్తలు భువనేశ్వరమ్మ,కళ్యాణి,ఆశ కార్యకర్త మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

About Author