సర్వీస్ లో ఉన్న టీచర్లకు టెట్ పరీక్ష నుండి మినహాయింపు ఇవ్వాలి
1 min read

: ఎస్.టి.యు ప్యాపిలి డిమాండ్
ప్యాపిలి న్యూస్ నేడు: ప్రస్తుతం సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ ను రద్దు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ స్టేట్ కౌన్సిలర్ వెంకట్ నాయక్ డిమాండ్ చేశారు. ఒకసారి పోటీ పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణులై ప్రభుత్వ విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు మళ్ళీ అర్హత పరీక్ష నిర్వహించడం సరైనది కాదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసి రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులుగా ఎంపికై దాదాపు 20-30 ఏళ్లు సర్వీస్ లో ఉన్న టీచర్లకు మళ్ళీ ఇప్పుడు టెట్ పరీక్ష అర్హులవ్వాలని నిబంధన విధించడం సరైనది కాదని తెలిపారు. మండలంలో ఎస్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా వివిధ పాఠశాలలలో ఎస్టీయూ నాయకులు ఉపాధ్యాయులకు ఎస్ టి యు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలానికి కొత్తగా 2025 మెగా డీఎస్సీ ద్వారా వచ్చి ఉపాధ్యాయులుగా వృత్తిలో చేరిన దాదాపుగా 64 మంది ఉపాధ్యాయులకు ఉచితంగా సర్వీస్ రిజిస్టర్ పుస్తకాలను ఎస్టియు ప్యాపిలి మండల శాఖ తరపున అందించారు .ఈ కార్యక్రమంలో ఎస్టియు స్టేట్ కౌన్సిలర్ వెంకట్ నాయక్, జిల్లా ఉపాధ్యాయ వాణి కన్వీనర్ చిన్నపరెడ్డి ,మండల ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, గౌరవాధ్యక్షులు కిరణ్ కుమార్ , జిల్లా కౌన్సిలర్ పవిత్రన్ రావు, మండల ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, సహాధ్యక్షులు సుదర్శన్ రెడ్డి మండల వాణి కన్వీనర్ శివ, సీనియర్ నాయకులు జి మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

