NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చే  గోశాల ప్రారంభోత్సవం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:            గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పి.దస్తగిరి రెడ్డి  ఆధ్వర్యంలో బాబా నగర్ నందు గల శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ప్రవచన చక్రవర్తి, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు  గురు రాఘవేంద్ర గోశాలను ప్రారంభించారు. సోమవారం ఉదయం చాగంటి కోటేశ్వరరావు  సతి సమేతంగా స్కూల్ ప్రాంగణానికి విచ్చేసి, పురోహితుల సమక్షంలో దస్తగిరి రెడ్డి  కుటుంబ సభ్యులు గోశాలను శాస్త్రోక్తంగా పూజలు చేశారు. చాగంటి కోటేశ్వరరావు స్కూల్ ప్రాంగణంలోని సరస్వతి కళామతల్లి విగ్రహానికి పూలమాలవేసి, వందన సమర్పణ గావించారు. అనంతరం ఎలక్ట్రికల్ వాహనం నందు స్కూల్ క్యాంపస్   వీక్షించారు .నేటితరం చిన్నారులకు అన్ని వసతులతో కూడినటువంటి పాఠశాల… ప్రకృతి ఒడిలో రనగొన   ధ్వనులు లేని ప్రశాంతమైన వాతావరణం లో చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రాంగణంలో గోశాలను ఏర్పాటు చేయడం ఎంతో పవిత్రతచేకూరుతుందని,  అన్ని శుభాలు జరుగుతాయని తెలిపారు.చైర్మన్ కి అభినందనలు తెలిపారు. విద్యా సంస్థల డైరెక్టర్లు పి మౌలాలి రెడ్డి , షేక్షావల్ రెడ్డి గురువర్యులు చాగంటి కోటేశ్వరరావు కి పూలమాల, శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *