NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విజ్ఞాన పీఠంలో  ఆట వస్తువుల మైదానం ప్రారంభోత్సవం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు శివారులోని జి. పుల్లారెడ్డి నగర్ లో గల విజ్ఞాన పీఠం అనాధ శరణాలయంలో 14 -3 -2026 ఉ. 10 గం.లకు జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత  పి సుబ్బారెడ్డి గారు ఆట వస్తువుల మైదానాన్ని పూజలు చేసి టెంకాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ “బాలల మేధస్సు పెరగాలంటే వారికి ఉల్లాసానందించే ఇటువంటి పార్కులు, ఆటమైదానాలు చాలా అవసరమని, విద్యార్థులకు శారీరక వ్యాయామంతో పాటు శారీరకమైన ఆటలు ఈనాడు చాలా అవసరం” అని తెలియజేశారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు  నంది రెడ్డి సాయి రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొని ,”వివేకానందుడు చెప్పిన విద్యలో శారీరక వ్యాయామాన్ని, శారీరక బలం యొక్క ఆవశ్యకతను “గుర్తు చేస్తూ  ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన పీఠం కరస్పాండెంట్  సి.మాణిక్య రెడ్డి, కోశాధికారి  రంగారెడ్డి, ప్రధానోపాధ్యాయులు శ్రీ చంద్రమోహన్,విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మాళిగి వ్యాస్ రాజ్,విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర మీడియా కన్వీనర్ మాళిగి భానుప్రకాష్, శ్రీనివాసులు, రణధీర్ రెడ్డి ,రాఘవేంద్ర ప్రసాద్,  , శ్రీ నాగిరెడ్డి ,శ్రీ మురళి ,ఉపేంద్ర నాయక్ పాల్గొన్నారు.

About Author