ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదానం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ చరిత్రలో ఒక బృహత్తర కార్యక్రమము మరియు ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద మరియు మధ్య తరగతి వానికి చెందే విధంగా,ఈ రక్త దాన కార్యక్రమం ఈరోజు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ అలపర్తి విద్యాసాగర్ జన్మదిన సందర్భంగా కర్నూలు జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమము కర్నూల్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల యందు ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంను సూపర్రింటెండెంట్ డా, వెంకటేశ్వర్లు ప్రారంభించడం జరిగినది. ఆర్ఎంఓ వెంకటరమణ ప్రత్యేక అతిధులుగా హాజరైనారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సి.కాశన్న, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఈశ్వరయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శిలు కేసిహెచ్ కృష్ణుడు ,ఆర్ వి రమణ, నాగ కిషోర్,కోడుమూరు తాలూకా అధ్యక్షులు శ్రీనివాస్, కర్నూలు నగర కార్యదర్శి ఎం రామకృష్ణ, నగర అసోసియేట్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నగర ఉపాధ్యక్షులు సాయిరాం, నగర కార్యవర్గము కృపా సాగర్ ,విజయకృష్ణ, హైమావతి, రామ తులసి,బీసీ వార్డెన్ ల సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ రాజు, ASWO అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మద్దిలేటి,ట్రెజరీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రవికుమార్, గవర్నమెంటు నర్సెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బంగారి మరియు వారి కార్యవర్గము, ప్రభుత్వ నాలుగు తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, మరియు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు మరియు కర్నూలు జిల్లా మరియు నగర కార్యవర్గం తదితర ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. దాదాపు 100 మంది రక్తదాన డోనర్స్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ సరోజన వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ బృత్తర కార్యక్రమము ఏర్పాటు చేసినందుకు ఏపీ ఎన్జీవో జీవో అసోసియేషన్ జిల్లా సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విద్యాసాగర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

