NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్లస్టర్ బేస్డ్ విధానంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన!

1 min read

జాబ్ మేళాల ద్వారా ఇప్పటివరకు 1.08 లక్షల మందికి ఉద్యోగాలు

ఇండస్ట్రీ టై అప్ తో స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలకు చర్యలు

సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ పై న్యూ సౌత్ వేల్స్ వర్సిటీతో ఒప్పందం

న్యాక్ బలోపేతం ద్వారా ప్రపంచస్థాయి భవన నిర్మాణ కార్మికులను తయారుచేస్తాం

శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్

అమరావతి, న్యూస్​ నేడు: సూపర్ -6లో ఇచ్చిన తొలి హామీ 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన. ఒకేరాష్ట్రం, ఒకేరాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజాప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్లస్టర్ బేస్డ్ విధానాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే సుమారు 22 క్లస్టర్లను గుర్తించామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాసనసభలో స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు ఏమేరకు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయి, శిక్షణా కేంద్రాల పనితీరు, ఉద్యోగావకాశాలు, ప్రతిపాదిత నూతన పారిశ్రామిక భాగస్వామ్య వివరాలపై ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ,, యార్లగడ్డ వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వెంకటరాజు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… రాయలసీమ, అనంతపురంలలో ఆటోమోటివ్ క్లస్టర్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, సిమెంట్ క్లస్టర్, కడప, చిత్తూరులో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, నెల్లూరులో గ్లాస్, ఏసీ క్లస్టర్ వస్తోంది. ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ క్లస్టర్, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్, గోదావరి జిల్లాలో ఆక్వా క్లస్టర్, ఉత్తరాంధ్రలో ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్ వస్తున్నాయి. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ కూడా వస్తున్నాయి.నర్సింగ్ పై పారా మెడికల్ కోర్సుల్లో కూడా ట్రైనింగ్ ఇవ్వాలని సభ్యులు కోరారు. యూరప్, జపాన్, జర్మనీలలో ఈ కోర్సులకు చాలా డిమాండ్ ఉంది. ఇందుకోసం ఓంక్యాప్ ద్వారా లాంగ్వేజ్ ట్రైనింగ్ చేస్తున్నాం. ఇప్పటికే 150మందిని వివిధ దేశాలకు పంపించాం.  5లక్షలమందిని విదేశాలకు పంపడం మా లక్ష్యం. గతంలో ఎపెక్స్ స్కిల్ యూనివర్సిటీ, పార్లమెంటు, నియోజకవర్గ కేంద్రాల్లో స్కిల్ కాలేజి ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు కానీ ఒక్కటి కూడా అమలుకాలేదు. గతంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ సిబ్బందితో పార్టీ పనిచేయించి ఉంటే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. జాబ్ మేళాల నిర్వహణలో క్వాలిటీ పెంచుతాం. అందరం కలిసికట్టుగా పనిచేస్తే 175 నియోజకవర్గాల్లో ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించవచ్చు. ప్రతి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను సీసీ టీవీ మానిటరింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. ఫేషియల్ రిక్నగ్నిషన్ సిస్టమ్ కూడా అమలు చేస్తున్నాం.రాబోయే 90రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన న్యాక్ ను బలోపేతం చేసే చర్యలు చేపట్టబోతున్నాం. ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ పై యార్లగడ్డ నేతృత్వంలో ఐదుగురితో ఒక కమిటీ వేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

About Author