మార్చి 7 న యోగ పోటీలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మార్చే ఏడో తేదీన కర్నూల్ అవుట్డోర్ స్టేడియం నందు ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి బాలికల యోగా పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా యోగా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్.ముంతాజ్ బేగం తెలిపారు.7 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల వరకు ఒక విభాగంగా,10 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు మరో విభాగం,14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు మరో విభాగంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు కార్యదర్శి మునిస్వామి 7981515467 ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ సంప్రదించాలని ఆమె కోరారు.

