పత్తి విత్తనాల హెచ్టి పరిక్షల తనిఖీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: వ్యవసాయశాఖ అగ్రికల్చర్ కమిషనర్ ఆదేశాల మేరకు పత్తి విత్తనాల హెచ్టి పరిక్ష ల నిమిత్తము తనిఖీ బృందము కర్నూలు జిల్లా కు రావడం జరిగినది. కల్లూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామం నందు శ్రీ రామ అగ్రి జెనెటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నందు 14 పత్తి విత్తనాల హెచ్టి టెస్ట్ లు చేయగా 14 నెగటివ్ వచ్చాయి మరియు శ్రీమ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నందు 20 పత్తి విత్తనాల చేయగా 20 నెగటివ్ ఫలితాలు రావడం జరిగినది సహజ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో రికార్డ్స్ అప్డేట్ చేయనందున రూ.62,29,914 రూపాయలు పత్తి విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేయడం జరిగినది.ఇందులో భాగంగా తనిఖీ బృందం కమిషనరేట్ గుంటూరు నుండి ఏడీఏ డి. ప్రవీణ్ , కమిషనరేట్ ఏలో జి, మోహన్ కుమార్ , కర్నూలు ఏడీఏ (R) యన్. సాలు రెడ్డి ,ఆగ్రోనామిస్ట్ ఏడీఏ రాజశేఖర్ ,కల్లూరు మండల వ్యవసాయ అధికారి డి. విష్ణు వర్ధన్ రెడ్డి వారు పాల్గొన్నారు.

