కళాశాలలోని హిందీ తెలుగు విభాగం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు
1 min read
దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, మలేషియా,దేశాల నుంచి ప్రముఖ వక్తలతో పాటుగా సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కళాశాలలోని హిందీ తెలుగు విభాగం వారు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు సమాజంలోని యువతకు మన సాహిత్యం పై అవగాహన కల్పించడమే కాకుండా దానిలోని నిక్షిప్తమై ఉన్న వ్యక్తిత్వ వికాసాంశాలను వెలుగులోనికి తెచ్చింది అన్నారు మదర్ ఎర్నెస్ట్ న్ ఫెర్నాన్ డేస్.స్థానిక సెయింట్ థెరెసా మహిళా స్వయంప్రతిపత్తి కళాశాలలోని హిందీ తెలుగు విభాగం వారు ఇటీవల 26 జనవరి నెలలో నెల్లూరులోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం వారితో కలిసి ప్రాచీన భారతీయ సాహిత్యం.వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, మలేషియా, దేశాల నుంచి ప్రముఖ వక్తలతో పాటుగా సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వీరంతా మన ప్రాచీన భారతీయ సాహిత్యం.రామాయణం, మహా భారతం, భగవద్గీత, వేదాలు పురాణాలలోని వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే వివిధ అంశాలను గురించి చర్చించారు. వివిధ ప్రాంతాల విద్వాంసులు పరిశోధకులు సమర్పించిన సుమారు 95 పత్రాలను తెలుగు సంస్కృత భాష పత్రాలతో ఒక ప్రతిని హిందీ ఆంగ్ల భాషా పత్రాలతో రెండవ ప్రతిని ముద్రించడం జరిగింది. ఈ ప్రతులను కళాశాల సుపీరియర్ అండ్ కరస్పాండెంట్ మదర్ ఎర్నెస్టైన్ ఫెర్నాన్ డేస్, ప్రిన్సిపల్ డాక్టర్:సిస్టర్ సునీల రాణి పూదోట, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్: సిస్టర్ సుశీల, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిస్టర్ ఇన్యాసమ్మ మరియు హిందీ తెలుగు విభాగ అధ్యాపకులు తో కలిసి ఆవిష్కరించారు.

