NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ్రగ్స్ రహిత భారతదేశం పై న్యాయ విజ్ఞాన సదస్సు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ప్రభుత్వ బి సి కళాశాల  బాలికల వసతి గృహం నందు  డ్రగ్స్ రహిత భారతదేశం పై న్యాయ విజ్ఞాన సదస్సు ”     జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్  స్టేట్ లీగల్ సర్వీసెస్   వారి ఆదేశాల మేరకు జాతీయ యువ దినోత్సవ వారోత్సవాలలో భాగంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, బుధవారం  నాడు  కర్నూలు బి. క్యాంపు నందు  గల   బీసీ కళాశాల బాలికల హాస్టల్ నందు డ్రగ్స్ రహిత భారతదేశం  పై  న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జడ్జి గారు మాట్లాడుతూ మాదక  ద్రవ్యాల వినియోగం వలన యువతకు కలిగే ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు, సామాజిక దుష్ప్రభావాల గురించి అవగాహన కలిగించారు. యువత మాదక     ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. ప్రజలు డ్రగ్స్ నేరాలు, సంబంధిత అంశాలపై నేరుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1933 కి  కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. దీనివల్ల డ్రగ్స్ ట్రాఫికింగ్ ను ఎదుర్కోవడానికి మాదక ద్రవ్యాల వాడకాన్ని  నివారించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. “డ్రగ్స్  వద్దు =జీవితమే ముద్దు ” అనే ప్రతిజ్ఞను బాలికల  చేత చేయించారు. పిల్లలకు చట్టపరమైన సమస్యలుంటే లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 కు కాల్ చేస్తే వెంటనే న్యాయ సహాయాన్ని అందిస్తామని తెలిపారు.ఈ సదస్సులో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, హాస్టల్స్ వెల్ఫేర్ ఆఫీసర్ కనకలత, బచ్పన్ బచావో ఆందోళన్ ఎన్జీవో మౌనిక  మరియు బాలికలు పాల్గొన్నారు.

About Author