NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జరిమానాలు కావు… ప్రాణ రక్షణే ముఖ్యం హెల్మెట్ పై అవగాహన

1 min read

సోమవరపాడు ఓవర్ బ్రిడ్జి క్రింద దెందులూరు పోలీసు,పెదపాడు పోలీసు ఉమ్మడి రహదారి నియమ నిబంధనలపై సూచనలు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్  నూజివీడు డీఎస్పీ  కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్  యొక్క ఆదేశాలపై పెదవేగి ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. రాజశేఖర్ ఆధ్వర్యంలో పెదపాడు ఎస్‌ఐ ఆర్. శ్రీనివాస్ దెందులూరు ఎస్సై వెంకట్ కుమార్  యొక్క సిబ్బందితో కలిసి సోమవరపాడు బ్రిడ్జి క్రింద రహదారి భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.జరిమానాకు  హెల్మెట్ లేకుండా ప్రమాదక రంగా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహన దారులను ఆపి, వారికి జరిమానాలు  విధించకుండా, అక్కడికక్కడే 55 మంది వాహన దారులతో హెల్మెట్లు కొనుగోలు చేయించి వారి ప్రాణ భద్రతపై అవగాహన కల్పించారు.హెల్మెట్ లేకుండా ప్రయాణిం చడం తలకు తీవ్ర గాయాలై ప్రాణాంత కంగా మారుతుందని ఎస్‌ఐ హెచ్చరించారు. అలాగే కారు డ్రైవర్లు, ప్రయాణికులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.మీ కుటుంబం మీ కోసం ఇంట్లో ఎదురు చూస్తోంది. అతివేగం, అజాగ్రత్తే ప్రమాదాలకు ప్రధాన కారణం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలి అని పెదపాడు ఎస్ఐ ఆర్ శ్రీనివాస్  దెందులూరు ఎస్ఐ వెంకట కుమార్ తెలియ చేసినారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *