అమరావతి రాజధాని పై విషం చిమ్ముతున్న జగన్ రెడ్డి… శొంఠి
1 min read

విజయవాడ, న్యూస్ నేడు : జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ అమరావతి రాజధాని మీద జగన్ రెడ్డి మరో సారి విషం కక్కాడు . నదీ గర్భానికి , నదీ తీరానికి తేడా తెలుసా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు.బిల్డింగ్ కట్టడానికి కూడా పర్మీషన్ లేని చోట చంద్రబాబు రాజధాని కడుతున్నాడా?ఎన్జిటి అమరావతిలో రాజధాని నిర్మాణం చేయవచ్చని తీర్పు ఇచ్చిన తర్వాతే అక్కడ చంద్రబాబు రాజధాని నిర్మాణాలు మొదలు పెట్టింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కంటే నీకు ఎక్కువ తెలుసా.నువ్వు 2019 ఎన్నికల కి ముందు రాజధాని ప్రాంతంలో ఎన్నికల ప్రచారం లో అమరావతి లో చంద్రబాబు రాజధాని నిర్మాణం ఆలశ్యం చేస్తున్నారు. నేను గెలిచిన తరువాత ఇక్కడే బ్రహ్మండమైన రాజధాని కడతాను అని ఎందుకు మాట్లాడావు ? అది నోరా తాటి మట్టా.. సమాధానం చెప్పు …మోసం చేద్దాం అని మాట్లాడావు కదా జగన్ రెడ్డి .అమరావతి లో కరెంట్ లేదా, రోడ్లు లేవా, నీళ్లు కూడా లేవా నీకు చిప్ దొబ్బింది జగన్ రెడ్డి.. నది పక్కన నీళ్లు లేవనడం,కరెంట్ లేదనడం అని అంటున్నావంటే నీకు మతిభ్రమించినట్టుంది జగన్ రెడ్డి.. ఇప్పుడు రాత్రిపూట కూడా నిర్మాణం జరుగుతూ విద్యుత్ కాంతులతో వెలిగిపోతుంది అమరావతి నీకు కళ్ళు పరిపూర్ణంగా కనిపిస్తే అక్కడికి వెళ్లి చూడు జగన్ రెడ్డి. రోడ్డు లేదా…సాక్షాత్తు నేషనల్ హైవే అమరావతి మధ్య లో నుంచి పోతుంది… ఇంకో రెండేళ్ల లో అమరావతి లో 360 కిలోమీటర్ల పొడవైన 200 ఫీట్ ల వెడల్పుతో వుండే అతిపెద్ద ట్రంక్ రోడ్ల నిర్మాణం పూర్తి అవుతుంది. అమరావతి విజయవాడ నుంచి 40 కిలోమీటర్ల దూరం వుందా… అమరావతికి విజయవాడకి దూరం కూడా జగన్ రెడ్డికి తెలియకపోవడం విచారకరం.ప్రకాశం బ్యారేజీ నుంచి పట్టుమని 10 కిలోమీటర్ల దూరం వుండదు. నీ తాడేపల్లి కొంప నుంచి 10 నిముషాలు పట్టదు .మన దేశ రాజధాని ఢిల్లీ యమునా నది ఒడ్డునే కదా వుంది. ప్రపంచం లో ప్రముఖ నగరాలన్నీ నదీ తీరంలోనే అభివృద్ధిచెందాయి . నాగరికత నదీ తీరంలోనే పుట్టింది. రాజ్యాంగం లో రాజధాని అనే పదం లేదా ..మరి ఏం ఉడపొడుస్తానికి ఆంధ్ర ప్రదేశ్ కి 3 రాజధానులు అని ప్రకటన చేశావు జగన్ రెడ్డి?సిఎం ఎక్కడ కూర్చుండే అదే రాజధానా ? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరు ప్యాలెస్ కి ఎన్నిసార్లు వెళ్లావు, అక్కడ ఎన్ని రోజులు గడిపావు మరి బెంగళూరు ప్యాలెస్ మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అవుతుందా జగన్ రెడ్డి.మరి ఐదేళ్లలో వైజాగ్ ను ఎందుకు రాజధాని చేయలేకపోయావు ?అక్కడ ఎందుకు కూర్చోలేకపోయావు జగన్ రెడ్డి.ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతి లో 60 వేల కోట్ల పనులు చేపిస్తున్నాడు …జగన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం వుంటే రేపు 2029 ఎన్నికలకు వెళ్ళేటప్పుడు అమరావతి ని రాజధానిగా అంగీకరించను అని చెప్పి ఎన్నికల కి వెళ్లు ..11 సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి లేకుండా 11 ఏళ్ల తర్వాత కూడా అమరావతి మీద ఇంకా విషం చిమ్మే నీ పార్టీ లో వున్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వెస్ట్ గోదావరి నాయకులు సిగ్గు అనేది వుంటే నీ పార్టీ కి వెంటనే రాజీనామా చెయ్యాలి. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు క్షమాపణ చెప్పాలి.విశాఖపట్నం , ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ రెడ్డి ను ఎలాగూ నమ్మరు.ఈ సమావేశంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పీతాగోపీచంద్,తాడిశెట్టి ప్రసాద్ పాల్గొన్నారు.

